Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే నటుడిని కాలేకపోయాను: సుందరం మాస్టర్

  • తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది
  • రిహార్సల్స్ లో బాగా చేసేవాడిని  
  • క్లాప్ కొట్టగానే డైలాగ్ మరిచిపోయేవాడిని    
డాన్స్ మాస్టర్ గా సుందరం మాస్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాల్లో ఆయన అక్కడక్కడా మెరిశారు కూడా. అలాంటి సుందరం మాస్టర్ నటన వైపుకు తాను ఎక్కువగా వెళ్లకపోవడం గురించి చెప్పారు."తమిళంలో ఎంజీఆర్ .. వైజయంతిమాలా జంటగా చేసే ఒక సినిమాలోనాకు చిన్న వేషం వేసే అవకాశం వచ్చింది. ఎలా చేస్తానోనని నన్ను టెస్ట్ చేశారు .. సూపర్ గా చేశాను.

 డైలాగ్ బాగా చెబుతున్నాడు .. మంచి కుర్రాడే దొరికాడు అని అక్కడున్న వాళ్లంతా అనుకున్నారు. కానీ క్లాప్ కొట్టగానే నా నోట్లో నుంచి మాట రావడం లేదు. క్లాప్ కొట్టకపోతే డైలాగ్ బాగా చెప్పేవాడిని. క్లాప్ కొడితే నాలో ఏదో భయం ప్రవేశించేది .. నోరంతా తడి ఆరిపోయేది. అలా ఒక డైలాగ్ కి 13 టేకులు తీసుకున్నాను. ఆ రోజున నేను డైలాగ్ బాగా చెప్పి వుంటే, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ అనే ఆర్టిస్టు వుండేవాడు కాదు" అంటూ నవ్వేశారు.    
sundaram master

More Telugu News